అన్యాయం..పైగా అవమానం

ABN , First Publish Date - 2020-10-03T07:59:23+05:30 IST

ఆయన కూతురిపై ముగ్గురు యువకులు అత్యాచార యత్నం చేశారు. వారిపై పెట్టిన కేసు ఉపసంహరించుకోవాలంటూ వైసీపీ ఎమ్మెల్యే సోదరుడి అనుచరులైన

అన్యాయం..పైగా అవమానం

 భరించలేక ఓ తండ్రి ఆత్మహత్యాయత్నం 

 కూతురిపై ముగ్గురి అత్యాచారయత్నం 

 నిందితులు వైసీపీ ఎమ్మెల్యే అనుచరులు


రాజమహేంద్రవరం సిటీ/కాకినాడ క్రైం,అక్టోబరు 2: ఆయన కూతురిపై ముగ్గురు యువకులు అత్యాచార యత్నం చేశారు. వారిపై పెట్టిన కేసు ఉపసంహరించుకోవాలంటూ వైసీపీ ఎమ్మెల్యే సోదరుడి అనుచరులైన ఇద్దరు వ్యక్తులు ఒత్తిడి చేశారు. ఇందుకు అంగీకరించకపోవడంతో... భార్యపై దుష్ప్రచారం చేశారు. బాధితుడిపైనే ఎదురు కేసు పెట్టారు. ఇవన్నీ తట్టుకోలేని ఆ వ్యక్తి... ఆత్మహత్యాయత్నం చేసుకున్నా రు. తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన దారుణమిది.


పోలీసులు, బాధితుల కథనం ప్రకారం... రాజమహేంద్రవరం రూరల్‌ మండలం బొమ్మూరులో నివసిస్తున్న మైనారిటీ వర్గానికి చెందిన ఒక వ్యక్తికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నెలరోజుల కిందట ముగ్గురు యువకులు ఆ వ్యక్తి కుమార్తెను అపహరించి అత్యాచారయత్నం చేస్తుండ గా స్థానికులు రక్షించారు. దీనిపై బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అప్పటి నుంచి నిందితు ల తరఫు బంధువులు... కేసు వెనక్కి తీసుకోవాలంటూ బాలిక తండ్రిపై ఒత్తిళ్లు మొ దలుపెట్టారు. రాజీ కావాలని, కొంత సొమ్ము ముట్టజెప్పుతామని ఆశచూపించారు. ఇందుకు అంగీకరించకపోవడంతో దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడి ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న బాలిక తండ్రి ఇటీవలే డిశ్చార్జ్‌ అయ్యాడు.


నిందితుడి తరఫువారు అంతటితో ఆగలేదు. బాధిత బాలిక తల్లిపై దుష్ప్రచారం చేస్తూ నలుగురిలో పరువు తీయసాగారు. బాలిక తండ్రిపై ఎస్సీ, ఎస్టీ కేసు కూడా పెట్టారు. దీంతో ఆ యన విసిగిపోయారు. తనపై ఒత్తిడి తెస్తున్న పరిమళ నాని, బాబి (వైసీపీ ఎమ్మెల్యే సోదరుడి అనుచరులు) అనే ఇద్దరు వ్యక్తులే తన చావుకు కారణమంటూ లేఖ రాసి గురువారం రాత్రి బొమ్మూరు పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో పురుగుల మందు తాగారు. ప్రస్తుతం ఆయన జీజీహెచ్‌లో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.


Updated Date - 2020-10-03T07:59:23+05:30 IST