-
-
Home » Andhra Pradesh » Shailajanath Comments on LG company
-
ఎల్జీ పాలిమర్స్ కంపెనీ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి: శైలజానాథ్
ABN , First Publish Date - 2020-05-13T18:26:15+05:30 IST
విశాఖ: ఎల్జీ పాలిమర్స్ కంపెనీని వెంకటాపురం నుంచి తరలించి, ఆ భూభాగాన్ని ప్రభుత్వ కార్యకలాపాలు కోసం ఉపయోగించాలని..

విశాఖ: ఎల్జీ పాలిమర్స్ కంపెనీని వెంకటాపురం నుంచి తరలించి, ఆ భూభాగాన్ని ప్రభుత్వ కార్యకలాపాలు కోసం ఉపయోగించాలని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ డిమాండ్ చేశారు. వెంకటాపురం, పరిసర గ్రామాల్లో విష ప్రభావం తొలిగిపోలేదన్నారు. కంపెనీ యాజమాన్యాన్ని తక్షణమే అరెస్ట్ చేసి, ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలన్నారు. అధికారులు, ప్రభుత్వం ప్రజలు పక్షాన మాట్లాడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సిటింగ్ జడ్జ్‌తో విచారణ చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక కమిటి వేస్తున్నామని... న్యాయ పోరాటం చేస్తామని శైలజానాథ్ తెలిపారు.