పగ, ప్రతీకార ప్రభుత్వం: షేక్ బాజీ
ABN , First Publish Date - 2020-05-17T19:22:27+05:30 IST
వైసీపీది పగ, ప్రతీకార ప్రభుత్వమని బీజేపీ మైనారిటీ కార్యదర్శి..

అమరావతి: వైసీపీది పగ, ప్రతీకార ప్రభుత్వమని బీజేపీ మైనారిటీ కార్యదర్శి షేక్ బాజీ విమర్శించారు. డాక్టర్ సుధాకర్‌పై పోలీసులు వ్యవహరించిన తీరుపై స్పందించిన ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ డాక్టర్ మతిస్థిమితం కోల్పోయారంటే.. అందుకు కారణం జగన్ ప్రభుత్వానిదేనని ఆరోపించారు. కరోనా నేపథ్యంలో ఈ ప్రభుత్వం కనీసం మాస్కులు, గ్లౌజులు కూడా ఇవ్వలేదని విమర్శించినంత మాత్రాన సుధాకర్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసిందన్నారు. ఈ ఐదేళ్లు ఎక్కడా పోస్టింగ్ లేకుండా కష్టాల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు తట్టుకోలేక మతిస్థిమితం కోల్పోతారని, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటారని ఆయన అన్నారు.
జగన్ ప్రభుత్వం పరోక్షంగా ఒక జాతికి సంబంధించిన వ్యక్తిపై కక్షసాధింపులకు పాల్పడినప్పుడు.. ఆ వ్యక్తి బలైనప్పుడు.. దానికి ప్రభుత్వం నైతిక బాధ్యత వాహించాలని షేక్ బాజీ అన్నారు. అలాగే నగరి మున్సిపల్ కమిషనర్‌ను కూడా ప్రభుత్వం సస్పెండ్ చేసిందన్నారు. ప్రభుత్వం మాట వినకపోతే కక్ష సాధింపులకు పాల్పడుతోందని.. దీనికి జగనన్న దళిత దాడుల పథకం అని పేరు పెట్టారన్నారు.