మూడేళ్ల చిన్నారిపై యువకుడి లైంగిక దాడి

ABN , First Publish Date - 2020-03-02T17:11:14+05:30 IST

శ్రీకాకుళం: మూడు సంవత్సరాల చిన్నారిపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడిన దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

మూడేళ్ల చిన్నారిపై యువకుడి లైంగిక దాడి

శ్రీకాకుళం: మూడు సంవత్సరాల చిన్నారిపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడిన దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది. శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం బుచ్చింపేటలో ఈ దారుణం చోటు చేసుకుంది. బుచ్చంపేటకు చెందిన దొప్ప గణేష్ అనే యువకుడు మూడు సంవత్సరాల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. చిన్నారి ఇంట్లో ఎవరూ లేని సమయంలో గణేష్ ఈ దారుణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. నిందితుడు పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

Updated Date - 2020-03-02T17:11:14+05:30 IST