-
-
Home » Andhra Pradesh » Seven people is sick
-
ఉమ్మెత్తకాయల ద్రావణం తాగి ఏడుగురికి అస్వస్థత
ABN , First Publish Date - 2020-04-07T19:49:18+05:30 IST
నాటు సారా తాగినా, ఉమ్మెత్తకాయల ద్రావణం తాగినా కరోనా వైరస్ రాదంటూ..

చిత్తూరు జిల్లా: నాటు సారా తాగినా, ఉమ్మెత్తకాయల ద్రావణం తాగినా కరోనా వైరస్ రాదంటూ ప్రచార జరగడంతో చిత్తూరు జిల్లాలో ఏడుగురు ప్రాణాలమీదకు తీసుకువచ్చింది. చిత్తూరు జిల్లా, బైరెడ్డిపల్లి మండలం, ఏ.కొత్తూరు గ్రామంలో మంగళవారం ఒకే కుటుంబంలో ఏడుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కరోనా వైరస్ నివారణ కోసం ఉమ్మెత్తకాయల ద్రావణం తాగడంతో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న అధికారులు వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. కరోనా వైరస్ నివారణ కోసం రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి. సారా తాగినా కరోనా నివారించవచ్చునని మెసేజ్‌లు వస్తున్నాయి.