లారీతో గుద్ది చంపినా ఆశ్చర్యం లేదు

ABN , First Publish Date - 2020-03-21T09:09:44+05:30 IST

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌ కుమార్‌ రాసిన లేఖపై దుమారం చెలరేగుతోంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సీపీఐ జాతీయ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ జాతీయ కార్యదర్శి

లారీతో గుద్ది చంపినా ఆశ్చర్యం లేదు

  • సీపీఐ జాతీయ నేతలు డీ రాజా, నారాయణ
  • ఎస్‌ఈసీ లేఖపై చర్చకు రండి..
  • వైసీపీ నేతలకు రామకృష్ణ సవాల్‌


న్యూఢిల్లీ, మార్చి 20(ఆంధ్రజ్యోతి): కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌ కుమార్‌ రాసిన లేఖపై దుమారం చెలరేగుతోంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సీపీఐ జాతీయ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ తిరుపతిలో మీడియా సమక్షంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘సీఎం జగన్‌ అత్యంత మూర్ఖపు చక్రవర్తి. ఆయనది ప్యాక్షనిస్టుల ప్రభుత్వం. అంతా క్రిమినల్‌ గ్యాంగ్‌. నిమ్మగడ్డను లారీతో గుద్ది చంపేసినా ఆశ్చర్యం లేదు’’ అని అన్నారు. ఆంధ్ర ఎస్‌ఈసీకి కేంద్రం భద్రత కల్పించాలంటూ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా నేరుగా అమిత్‌ షాకు లేఖ రాశారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా నిర్వహించడానికి వీలు లేకుండా, భయానక పరిస్థితులు ఏర్పడడానికి సీఎం, మంత్రులను బాధ్యులను చేయాలని లేఖలో స్పష్టం చేశారు. ఇదే అంశంపై పార్టీ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఎస్‌ఈసీ రమేశ్‌కుమార్‌ కేంద్రానికి రాసిన లేఖపై బహిరంగ చర్చకు రావాలని ఆయన వైసీపీ నేతలకు సవాల్‌ విసిరారు. ఈ చర్చకు సమన్వయకర్తలుగా జర్నలిస్టు సంఘాల నేతలు, ప్రభుత్వ సలహాదారులు కే రామచంద్రమూర్తి, దేవులపల్లి అమర్‌లలో ఎవరైనా సరేనని ప్రతిపాదించారు.

Updated Date - 2020-03-21T09:09:44+05:30 IST