న్యాయం కోరితే చర్యలా? : ఆర్టీసీ జేఏసీ
ABN , First Publish Date - 2020-05-17T10:36:56+05:30 IST
కార్మికులు న్యాయంగా రావాల్సిన జీతం అడిగినందుకు ఒక రోజు వేతనం కోత విధిస్తూ చర్యలు తీసుకోవడం ఏంటని ఆర్టీసీ జేఏసీ ప్రశ్నించింది.

అమరావతి, మే 16(ఆంధ్రజ్యోతి):కార్మికులు న్యాయంగా రావాల్సిన జీతం అడిగినందుకు ఒక రోజు వేతనం కోత విధిస్తూ చర్యలు తీసుకోవడం ఏంటని ఆర్టీసీ జేఏసీ ప్రశ్నించింది. లాక్‌డౌన్ సమయంలో కట్ చేసిన 50శాతం జీతం చెల్లించాలని ఈ నెల 14న ఏలూరు బస్ డిపోలో ఎస్‌డబ్ల్యూఎఫ్ నిరసన వ్యక్తం చేసింది. దీంతో యాజమాన్యం తీసుకున్న చర్యలను జేఏసీ నేతలు పలిశెట్టి దామోదర్‌రావు, వైవీ రావు ఖండించారు.