ఇలాంటి ప్రభుత్వాన్ని మొదటిసారిగా చూస్తున్నా..: న్యాయవాది

ABN , First Publish Date - 2020-05-29T17:50:29+05:30 IST

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు గట్టి షాక్‌ ఇచ్చింది.

ఇలాంటి ప్రభుత్వాన్ని మొదటిసారిగా చూస్తున్నా..: న్యాయవాది

అమరావతి: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు గట్టి షాక్‌ ఇచ్చింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ ‌కుమార్‌‌ను కొనసాగించాల్సిందేనని ఉన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది.  న్యాయస్థానం తీర్పుపై స్పందించిన ఓ మహిళా సీనియర్ న్యాయవాది ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ రాజ్యాంగాన్ని, ఆర్డినెన్స్‌లను మార్చేసి.. వారికి అనుకూలంగా మార్చుకోవాలన్న ప్రభుత్వాన్ని చూడడం ఇదే మొదటిసారని అన్నారు. ఏదైనా చేయగలం, తాము చేసిందే కరెక్టు అనే ఉద్దేశంతో జగన్ ప్రభుత్వం ఎందుకుందో అర్థం కావడంలేదని అన్నారు. స్వతంత్ర్య ప్రతిపత్తిగల ఎలక్షన్ కమిషనర్‌ను మార్చివేసే ఆర్డినెన్సులు తీసుకువచ్చి, రాత్రికి రాత్రే ఏదో చేసేయాలని అనుకుంటోందని, అసలు రాష్ట్రాని ఏం చేద్దామని ప్రభుత్వం అనుకుంటుందో అర్థం కావడంలేదని ఆమె అన్నారు.

Updated Date - 2020-05-29T17:50:29+05:30 IST