కరోనాతో సచివాలయ అధికారి మృతి

ABN , First Publish Date - 2020-08-20T07:01:27+05:30 IST

అమరావతి, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): సచివాలయంలోని పశుసంవర్థక శాఖలో పనిచేస్తున్న సెక్షన్‌ అధికారికి ఇటీవల కరోనా సోకింది.

కరోనాతో సచివాలయ అధికారి మృతి

బిల్లు 25లక్షలు.. వర్తించని ఈహెచ్‌ఎస్‌ 

అమరావతి, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): సచివాలయంలోని పశుసంవర్థక శాఖలో పనిచేస్తున్న సెక్షన్‌ అధికారికి ఇటీవల కరోనా సోకింది. హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో నెల రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన బుధవారం మృతిచెందారు. సదరు ఆస్పత్రి రూ.25లక్షల బిల్లు వేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం అందించే ఎంప్లాయీ హెల్త్‌ స్కీమ్‌(ఈహెచ్‌ఎస్‌) వర్తించకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులే ఈ మొత్తం బిల్లు చెల్లించినట్లు సహచర ఉద్యోగులు పేర్కొంటున్నారు. 

Read more