‘మెరిట్’తోనే సచివాలయ ఉద్యోగాలు: లోకేశ్
ABN , First Publish Date - 2020-08-22T09:25:10+05:30 IST
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలను మెరిట్ లిస్ట్‌తోనే భర్తీ చేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి లోకేశ్ డిమాండ్ చేశారు.
అమరావతి, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలను మెరిట్ లిస్ట్‌తోనే భర్తీ చేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి లోకేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి శుక్రవారం లేఖ రాశారు. ‘‘రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బంది నియామకం కోసం నిర్వహించిన పరీక్షలో అర్హత సాధించి సర్టిఫికెట్ పరిశీలన పూర్తయినా... చాలా మంది నియామకపత్రాలు అందక వేచి చూస్తున్నారు..వీరుఉన్నా 3 వేల ఉద్యోగాల కోసం రెండో విడత ప్రకటన ఇవ్వడం సరికాదు... ఈ అభ్యర్థులతోనే పై ఉద్యోగాలను భర్తీ చేయాలని లోకేశ్ కోరారు.