మరోసారి కోర్టుకు ఎస్ఈసీ రమేష్ కుమార్

ABN , First Publish Date - 2020-11-19T17:14:38+05:30 IST

అమరావతి: ఎస్ఈసీ నిర్వహించాలనుకున్న వీడియో కాన్ఫరెన్స్ రద్దు అయిన విషయం తెలిసిందే.

మరోసారి కోర్టుకు ఎస్ఈసీ రమేష్ కుమార్

అమరావతి: ఎస్ఈసీ నిర్వహించాలనుకున్న వీడియో కాన్ఫరెన్స్ రద్దు అయిన విషయం తెలిసిందే. ప్రభుత్వం వైపు నుంచి క్లారిటీ రాకపోవడంతో ఎస్ఈసీ రమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్సుని రద్దు చేసుకున్నారు. ప్రభుత్వం సహకరించడం లేదనే విషయాన్ని ఎస్ఈసీ కోర్టు దృష్టికి తీసుకెళ్లనుంది. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహణ కోసం రెండు సార్లు లేఖలు రాసినా అంగీకరించ లేదనే విషయాన్ని సైతం కోర్టు దృష్టికి తీసుకెళ్లే యోచనలో ఎస్ఈసీ ఉంది. తాము సంప్రదింపులు జరుపుతున్నా.. ప్రభుత్వం సహకరించడం లేదనడానికి ఇదే నిదర్శనమని ఎస్ఈసీ వర్గాలు చెబుతున్నాయి.


Updated Date - 2020-11-19T17:14:38+05:30 IST