అన్నీ తానే అనుకోవడం ఎస్‌ఈసీకి తగదు: మంత్రి సురేశ్‌

ABN , First Publish Date - 2020-03-19T10:11:14+05:30 IST

‘‘రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ ఆరు వారాలపాటు ఉంటుందన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తొలగించింది. ఈ తీర్పు ఎవరి పరిధి ఏమిటీ అనేది తెలియజేసింది’’ అని మంత్రి ఆదిమూలపు సురేశ్‌...

అన్నీ తానే అనుకోవడం ఎస్‌ఈసీకి తగదు: మంత్రి సురేశ్‌

అమరావతి, మార్చి 18(ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ ఆరు వారాలపాటు ఉంటుందన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తొలగించింది. ఈ తీర్పు ఎవరి పరిధి ఏమిటీ అనేది తెలియజేసింది’’ అని మంత్రి ఆదిమూలపు సురేశ్‌ అన్నారు. బుధవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అన్నీ తానే అనుకోవడం సరికాదన్నారు. ఎన్నికల కోడ్‌ పేరుతో సంక్షేమ పథకాలు అపడం సరికాదని తాము ముందే చెప్పామన్నారు. ఇప్పుడు కోడ్‌ ఎత్తేయడంతో సంక్షేమ పథకాలు అన్నీ అమలు చేస్తామన్నారు. ఎస్‌ఈసీ ఏకపక్షంగా ఎన్నికలను వాయిదా వేసిందనీ, ప్రభుత్వాన్ని అడిగితే కరోనాపై రాష్ట్రంలో పరిస్థితి ఏంటో చెప్పే వాళ్లమని అన్నారు.

Updated Date - 2020-03-19T10:11:14+05:30 IST