గవర్నర్‌కు ఎస్ఈసీ నిమ్మగడ్డ లేఖ
ABN , First Publish Date - 2020-12-05T19:39:51+05:30 IST
గవర్నర్ విశ్వభూషణ్‌కు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ లేఖ రాశారు. స్థానిక ఎన్నికల నిర్వహణపై అసెంబ్లీ

అమరావతి: గవర్నర్ విశ్వభూషణ్‌కు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ లేఖ రాశారు. స్థానిక ఎన్నికల నిర్వహణపై అసెంబ్లీ తీర్మానం రాజ్యాంగ విరుద్ధమని లేఖలో పేర్కొన్నారు. ‘రాజ్యాంగంలోని 243కే అధికరణ కింద ఎన్నికల కమిషన్‌కు స్వయం ప్రతిపత్తి ఉంది. ఐదేళ్లకోసారి ఎన్నికలు జరపడం కమిషన్ విధి. కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు సమాన అధికారాలు ఉన్నాయి. ప్రభుత్వ సమ్మతితో ఎన్నికలు జరపాలన్న నిర్ణయం రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధం. అలాంటి ఆర్డినెన్స్ వస్తే తిరస్కరించండి. అవసరమైతే సుప్రీంకోర్టు న్యాయనిపుణులను సంప్రదించండి’ అంటూ గవర్నర్‌కు రాసిన లేఖలో నిమ్మగడ్డ విజ్ఞప్తి చేశారు.