లాక్ డౌన్‌తో వలస కూలీల వెతలు

ABN , First Publish Date - 2020-05-10T22:02:08+05:30 IST

లాక్ డౌన్‌తో పనులు నిలిచిపోవడంతో వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు..

లాక్ డౌన్‌తో వలస కూలీల వెతలు

ప్రకాశంజిల్లా: లాక్ డౌన్‌తో పనులు నిలిచిపోవడంతో వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదుకునేవారులేక కష్టాలపాలవుతున్నారు. స్వస్థలాలకు పంపాలంటూ ప్రకాశం జిల్లా చీమకుర్తిలో గత నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్న కూలీలు చివరికి విసుగుపోయారు. అధికారులు స్పందించకపోవడంతో కాలినడకన సొంతూళ్లబాటపట్టారు. వాహనాలు లేకపోయినా వేల కిలోమీటర్లు నడిచివెళ్లిపోతున్నారు. చిన్నపిల్లలు సైతం వారివెంట నడుస్తున్నారు.

Updated Date - 2020-05-10T22:02:08+05:30 IST