అచ్చెన్నను హతమార్చడానికి పథకం: దేవినేని ఉమా

ABN , First Publish Date - 2020-06-25T16:57:32+05:30 IST

కరకట్ట దగ్గర టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.

అచ్చెన్నను హతమార్చడానికి పథకం: దేవినేని ఉమా

అమరావతి: కరకట్ట దగ్గర టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ప్రజావేదిక కూల్చి గురువారంనాటికి ఏడాది అయింది. ఈ సందర్భంగా ప్రజావేదిక శిథిలాల వద్దకు టీడీపీ నేతలు చేరుకున్నారు. ఇక్కడ ఎలాంటి నిరసనలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ఆదేశాలను ధిక్కరిస్తే అరెస్టు చేస్తామన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం జరగడంతో టీడీపీ నేతలు నక్కా ఆనందబాబు, దేవినేని ఉమా,  వర్ల రామయ్య, ఆలపాటి రాజా, కొల్లు రవీంద్ర తదితరులను అరెస్టు చేసి వ్యాన్ ఎక్కించారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ ఆస్పత్రిలో ఉన్న అచ్చెన్నాయుడును అరెస్టు చేశారని, అచ్చెన్నను హతమార్చాలని దుర్మార్గమైన పథకం వేశారని ఆరోపించారు. సజ్జల రామకృష్ణారెడ్డి డైరక్షన్‌లో బడుగు బలహీన వర్గాల్లో పార్టీ నాయకుడుగా, పాలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్న అచ్చెన్నను అరెస్టు చేసి రాత్రి కస్టడీలోనే చంపాలని ప్రయత్నం చేశారని ఆరోపించారు. అలాగే చంద్రబాబు ఇంటికి వెళ్లే మార్గంలో పోలీసులు మోహరించారు. పరిస్థితి ఉద్రిక్తతగా ఉంది.

Updated Date - 2020-06-25T16:57:32+05:30 IST