మద్యం ధరలను పెంచి నిలువు దోపిడీ చేస్తున్నారు: సవిత

ABN , First Publish Date - 2020-05-11T22:22:57+05:30 IST

అనంతపురం: మద్యపాన నిషేధం అమలు చేయాలని రాష్ట్ర కురుబ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సవిత పేర్కొన్నారు.

మద్యం ధరలను పెంచి నిలువు దోపిడీ చేస్తున్నారు: సవిత

అనంతపురం: మద్యపాన నిషేధం అమలు చేయాలని రాష్ట్ర కురుబ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సవిత పేర్కొన్నారు. నేడు ఆమె మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలంటూ నిరాహార దీక్షకు పూనుకున్నారు. అనంతపురం జిల్లా పెనుకొండలో ఆమె 12 గంటల దీక్షకు కూర్చొన్నారు. ఈ సందర్భంగా సవిత మాట్లాడుతూ... టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు మేరకు అనంతపురం జిల్లా పెనుకొండలో ఈ దీక్షను చేస్తున్నట్టు తెలిపారు. లాక్ డౌన్ కారణంగా పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వీరికి పదివేల రూపాయలు ప్రభుత్వం తక్షణ సాయం అందించాలని డిమాండ్ చేశారు.


మద్యం ధరలు 75 శాతం పెంచి మధ్యతరగతి కుటుంబాలను నిలువు దోపిడీ చేస్తున్నారన్నారు. టీడీపీ పాలనలో కడుపు నిండా అన్నం పెట్టేందుకు అమలు చేసిన అన్న క్యాంటీన్‌ను వైసీపీ ప్రభుత్వం మూసివేసిందన్నారు. తక్షణమే దానిని పునరుద్ధరించాలని సవిత డిమాండ్ చేశారు. నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైసీపీ ప్రభుత్వంపై తక్కువ సమయంలోనే ప్రజల నుంచి పూర్తి వ్యతిరేకత వచ్చిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి, పేద కుటుంబాలు రోడ్డున పడకుండా చిత్తశుద్ధితో మద్యాన్ని పూర్తిగా నియంత్రించాలన్నారు. 


Updated Date - 2020-05-11T22:22:57+05:30 IST