కొడాలి నాని మతి భ్రమించి.. మదమెక్కి మాట్లాడుతున్నారు: సత్యమూర్తి

ABN , First Publish Date - 2020-09-24T17:25:50+05:30 IST

విజయవాడ: మంత్రి కొడాలి నానిని బర్తరఫ్ చేయాలంటూ బీజేపీ ఆందోళనకు దిగింది. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టిన బీజేపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.

కొడాలి నాని మతి భ్రమించి.. మదమెక్కి మాట్లాడుతున్నారు: సత్యమూర్తి

విజయవాడ: మంత్రి కొడాలి నానిని బర్తరఫ్ చేయాలంటూ బీజేపీ ఆందోళనకు దిగింది. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టిన బీజేపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. సీఎంకు, కొడాలి నానికి వ్యతిరేకంగా బీజేపీ నేతలు నినాదాలు‌ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేత సత్యమూర్తి మాట్లాడుతూ.. మంత్రి కొడాలి నాని మతి భ్రమించి, మదం ఎక్కి మాట్లాడుతున్నారన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ఇంత జరుగుతున్నా సీఎం జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని సత్యమూర్తి ప్రశ్నించారు. కొడాలి నానిని వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. 


Updated Date - 2020-09-24T17:25:50+05:30 IST