ఒంగోలు రమేష్ సంఘమిత్ర ఆస్పత్రిలో దారుణం

ABN , First Publish Date - 2020-08-18T20:30:16+05:30 IST

ఒంగోలు రమేష్ సంఘమిత్ర ఆస్పత్రిలో దారుణం జరిగింది.

ఒంగోలు రమేష్ సంఘమిత్ర ఆస్పత్రిలో దారుణం

ప్రకాశం జిల్లా: ఒంగోలు రమేష్ సంఘమిత్ర ఆస్పత్రిలో దారుణం జరిగింది. కరోనాతో మృతి చెందిన వారి మృత దేహాలను ఆస్పత్రి సిబ్బంది తారుమారు చేశారు. కంభంకు చెందిన ఖలీల్ అహ్మద్ అనే వ్యక్తి కరోనాతో చికిత్స పొందుతూ చనిపోయాడు. 12 రోజుల పాటు ఖలీల్‌కు చికిత్స చేశారు. ఆదివారం సాయంత్రం ఖలీల్ చనిపోయినట్లు ఆస్పత్రి సిబ్బంది కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో మృత దేహాన్ని తీసుకువెళ్లేందుకు ఖలీల్ కుటుంబసభ్యులు ఆస్పత్రికి వచ్చారు. అయితే ఖలీల్ మృత దేహానికి బదులు వీరయ్య అనే మరో మృత దేహాన్ని  అప్పగించారు. దీంతో వారు సిబ్బందిని నిలదీశారు. కానీ ఎవరూ స్పందించలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.


అయితే అప్పటికే ఖలీల్ మృత దేహాన్ని వీరయ్య కుటుంబసభ్యులకు అప్పగించడంతో వారు ఒంగోలులో అంత్యక్రియలు పూర్తి చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఖలీల్ కుటుంబసభ్యులు కోరుతున్నారు.

Updated Date - 2020-08-18T20:30:16+05:30 IST