ట్రాక్టర్లకూ ఇసుక ఉచితమే!

ABN , First Publish Date - 2020-06-26T07:46:39+05:30 IST

ఇసుక కృత్రిమ కొరత, భారీ ధరలపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఎడ్లబళ్లపై సొంత అవసరాలకు ఇసుక ఉచితంగా..

ట్రాక్టర్లకూ ఇసుక ఉచితమే!

సచివాలయం అనుమతితో సొంత అవసరానికే!

బలహీనవర్గాల గృహ నిర్మాణం, పునరావాసానికీ


అమరావతి, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): ఇసుక కృత్రిమ కొరత, భారీ ధరలపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఎడ్లబళ్లపై సొంత అవసరాలకు ఇసుక ఉచితంగా తీసుకెళ్లొచ్చని ప్రకటించిన ప్రభుత్వం.. తాజాగా ట్రాక్టర్లకూ అనుమతి ఇచ్చింది. అయితే 1,2,3 ఆర్డర్‌ రీచ్‌లలో మాత్రమే దీనికి అనుమతి తెలిపింది. సొంత అవసరాలు, బలహీనవర్గాల గృహ నిర్మాణం, సహాయ పునరావాస ప్యాకేజీలకు మాత్రమే ఇసుకను ఉచితంగా తీసుకెళ్లొచ్చు.


సొంత అవసరాలకు ఇసుక తీసుకెళ్లేవారు గ్రామ సచివాలయం, వార్డు సచివాలయాల నుంచి అనుమతి తీసుకోవాలి. అనుమతి కోరిన వారి వివరాలు నమోదు చేసుకుని, ఎలాంటి ఫీజు లేకుండా సచివాలయాలు అనుమతి పత్రం ఇస్తాయి. బలహీన వర్గాల గృహ నిర్మాణం, సహాయ, పునరావాస ప్యాకేజీలకు సంబంఽధించిన పనులకు ఉచితంగా ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తీసుకెళ్లేందుకు కలెక్టర్‌ అనుమతి తీసుకోవాలి. లేదంటే కలెక్టర్‌ బాధ్యతలు అప్పగించిన మరో అధికారి అయినా అనుమతి ఇవ్వొచ్చు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది.  

Updated Date - 2020-06-26T07:46:39+05:30 IST