పరీక్షలు సగం.. కేసులు రెట్టింపు!

ABN , First Publish Date - 2020-07-08T08:19:41+05:30 IST

రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. మరోవైపు ఫలితాలు రాలేదంటూ పరీక్షలను తగ్గించేశారు. కేసులు పెరుగుతున్నప్పుడు

పరీక్షలు సగం.. కేసులు రెట్టింపు!

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. మరోవైపు ఫలితాలు రాలేదంటూ పరీక్షలను తగ్గించేశారు. కేసులు పెరుగుతున్నప్పుడు మరిన్ని పరీక్షలు చేస్తేనే వైరస్‌ వ్యాప్తి తీవ్రత తెలుస్తుందని, ఈ సమయంలో వైద్యపరీక్షలను కుదిస్తే మొదటికే మోసం వస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొద్ది రోజులుగా ఇదే జరుగుతోందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈనెల 1న పరీక్షించిన వారిలో మొత్తం పాజిటివ్‌లు 3శాతం కాగా, వారం వ్యవధిలోనే ఇది 7శాతం దాటింది. ‘‘రాష్ట్రంలో 2లక్షలపైనే శాంపిల్స్‌ పెండింగ్‌లో ఉన్నాయి. వాటి ఫలితాలు వచ్చేవరకు పరీక్షలు తగ్గించడం చాలా ప్రమాదం. దీనికన్నా ల్యాబ్‌లను పెంచడమే అసలైన ప్రత్యామ్నాయం. దానివల్ల పెండింగ్‌ సమస్య తీరడంతో పాటు వైరస్‌ వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో మరింతగా తెలుసుకోవచ్చు’’ అని ప్రభుత్వ రంగంలోనే కొవిడ్‌ సేవలో ఉన్న ఓ వైద్యాధికారి అభిప్రాయపడ్డారు. 



Updated Date - 2020-07-08T08:19:41+05:30 IST