అలా చెబుతున్నారు..అది అవాస్తవం: డా.సమరం

ABN , First Publish Date - 2020-03-24T21:37:47+05:30 IST

అలా చెబుతున్నారు..అది అవాస్తవం: డా.సమరం

అలా చెబుతున్నారు..అది అవాస్తవం: డా.సమరం

అమరావతి: వార్తా పత్రికలతో కరోనా వైరస్‌ సోకుతుందనేది అబద్ధమని డాక్టర్.సమరం అన్నారు. న్యూస్‌ పేపర్లతో వైరస్‌ వస్తుంది అనేది ఈ శతాబ్ధపు జోకని కొట్టిపారేశారు. మనిషి నుంచి మరో మనిషికి మాత్రమే వైరస్‌ సోకుతుందన్నారు. పత్రికా ప్రచురణ ప్రక్రియలో ఏ దశలోనూ వైరస్‌ సోకే అవకాశం లేదని చెప్పారు. యాజమాన్యాలు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయని ఆయన తెలిపారు. సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం ఎక్కువైందన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధంపై ప్రజలకు అవగాహన కల్పించడం..ఆరోగ్య సంరక్షణలో పత్రికలు, ఎలక్ట్రానిక్‌ మీడియా కీలకపాత్ర పోషిస్తున్నాయని కొనియాడారు. లాక్‌డౌన్‌ సమయంలో ఇంట్లో ఉన్నవారు పత్రికలు, టీవీలు చూసి వార్తలు తెలుసుకోండి..భయాలు వీడండని సూచించారు. 

 

Updated Date - 2020-03-24T21:37:47+05:30 IST