వీఆర్ పోలీసులకు జీతం కట్!
ABN , First Publish Date - 2020-06-09T09:57:54+05:30 IST
నెలల తరబడి వేకన్సీ రిజర్వ్(వీఆర్)లో ఉండి ఇటీవలే పోస్టింగ్‌లో చేరిన పోలీసు అధికారులకు ప్రభుత్వం సగం జీతమే ఇచ్చింది. ఇదేంటని అడిగితే.. మీరు వీఆర్‌లో ఉన్నారు కదా? అన్నది ఆర్థికశాఖ అధికారుల ప్రశ్న.
అమరావతి, జూన్ 8(ఆంధ్రజ్యోతి): నెలల తరబడి వేకన్సీ రిజర్వ్(వీఆర్)లో ఉండి ఇటీవలే పోస్టింగ్‌లో చేరిన పోలీసు అధికారులకు ప్రభుత్వం సగం జీతమే ఇచ్చింది. ఇదేంటని అడిగితే.. మీరు వీఆర్‌లో ఉన్నారు కదా? అన్నది ఆర్థికశాఖ అధికారుల ప్రశ్న. ఈ విషయాన్ని కొందరు డీఎస్పీలు డీజీపీ గౌతమ్ సవాంగ్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన ఆర్థికశాఖకు లేఖ రాసినట్లు తెలిసింది. వీఆర్‌లో ఉన్నా వారందరూ పని చేశారని, పెండింగ్ జీతం ఆపకుండా పూర్తిగా చెల్లించాలని లేఖలో పేర్కొన్నట్లు సమాచారం.