వేతనాలెప్పుడు ?
ABN , First Publish Date - 2020-08-02T01:59:43+05:30 IST
ప్రభుత్యోద్యోగులకు వాస్తవానికి ఈ రోజే వేతనాలు జమ కావాలి. కానీ... ఈ రోజు బక్రీద్ కావడంతో వేతనాలు జమ కాలేదని సర్దుకున్నారు. ఇక రెండవ తారీఖు... ఆదివారం. మరి సోమవారమైనా వేతనాలు వస్తాయా ? అంటే డౌటే. నిధుల లేమి పరిస్థితులు ఇందుకు కారణమని వినవస్తోంది.

అమరావతి : ప్రభుత్యోద్యోగులకు వాస్తవానికి ఈ రోజే వేతనాలు జమ కావాలి. కానీ... ఈ రోజు బక్రీద్ కావడంతో వేతనాలు జమ కాలేదని సర్దుకున్నారు. ఇక రెండవ తారీఖు... ఆదివారం. మరి సోమవారమైనా వేతనాలు వస్తాయా ? అంటే డౌటే. నిధుల లేమి పరిస్థితులు ఇందుకు కారణమని వినవస్తోంది.
ఇక నాలుగవ తేదీన... మంగళవారం. కానీ... ప్రభుత్వం ప్రతీ మంగళవారం ఆర్బీఐ బాండ్లను వేలం వేసే ప్రక్రియను నిర్వహిస్తోంది. ఇదే క్రమంలో... నాలుగవ తేదీన బాండ్లను వేలం వేసి, తద్వారా రూ. రెండు వేల కోట్లు సమీకరించుకుని, ఆ క్రమంలో... ప్రాధాన్యాలవారీగా జీతాలను సర్దుబాటు చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.
అంటే... ఈ మొత్తం ప్రక్రియ పూర్తై, కొందరికైనా వేతనాలందాలంటే... ఐదవ తేదీ వరకు ఎదురుచూడాల్సిన పరిస్థితి. అది కూడా ఉద్యోగులందరికీ అదే రోజు వేతనాలందే అవకాశముండబోదు. మొత్తంమీద ఉద్యోగులకు వేతనాలెప్పుడన్న విషయమై ప్రభుత్వ వర్గాల నుంచి సమాధానం లేకపోవడం గమనార్హం.