సలాం కేసులో న్యాయం చేయలేకపోతే చీర, గాజులు తొడుక్కొని ఇంట్లో కూర్చో!

ABN , First Publish Date - 2020-11-19T10:20:19+05:30 IST

అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో బాధితులకు న్యాయం చేయడం చేతకాకపోతే చీర, గాజులు తొడుక్కొని ఇంట్లో కూర్చోవాలని

సలాం కేసులో న్యాయం చేయలేకపోతే చీర, గాజులు తొడుక్కొని ఇంట్లో కూర్చో!

ఎమ్మెల్యే శిల్పా రవిని  ఉద్దేశించి ఎంఐఎం నేత జునైద్‌ ఘాటు వ్యాఖ్యలు


నంద్యాల (నూనెపల్లె), నవంబరు 18: అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో బాధితులకు న్యాయం చేయడం చేతకాకపోతే చీర, గాజులు తొడుక్కొని ఇంట్లో కూర్చోవాలని ఎంఐఎం పార్టీ కర్నూలు జిల్లా కన్వీనర్‌ జునైద్‌.. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుని 16 రోజులవుతున్నా ఈ కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంపై ఆయన ఘాటుగా స్పందించారు. సలాం అత్త మాబున్నీసాను పరామర్శించేందుకు ఎంఐఎం నాయకులు బుధవారం నంద్యాలకు వచ్చారు. ఆమెను పరామర్శించిన అనంతరం నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవికి చీర, గాజులు అందించేందుకు వెళ్తుండగా స్థానిక బొమ్మలసత్రం ఫ్లైఓవర్‌ బ్రిడ్జి వద్ద పోలీసులు అడ్డగించారు. అబ్దుల్‌ సలాం న్యాయపోరాట కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యాలయం సర్కిల్‌లో చేపడుతున్న రిలేనిరాహార దీక్షల శిబిరాన్ని ఎంఐఎం నాయకులు సందర్శించి మద్దతు తెలిపారు.

Updated Date - 2020-11-19T10:20:19+05:30 IST