మోదీపై కొడాలి నాని వ్యాఖ్యలను తప్పుపట్టిన సజ్జల

ABN , First Publish Date - 2020-09-24T21:36:35+05:30 IST

ప్రధాని మోదీపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తప్పుపట్టారు. మోదీ దేశానికి ప్రధాని.. ఆయనపై

మోదీపై కొడాలి నాని వ్యాఖ్యలను తప్పుపట్టిన సజ్జల

అమరావతి: ప్రధాని మోదీపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తప్పుపట్టారు. మోదీ దేశానికి ప్రధాని.. ఆయనపై వ్యక్తిగత వ్యాఖ్యలు సరికాదన్నారు. ప్రధానిపై మంత్రి కొడాలి నాని ఏం వ్యాఖ్యలు చేశారో తెలియదని చెప్పారు. అయినా ప్రధాని మోదీపై కొడాలి నాని వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని స్పష్టం చేశారు. మోదీ గురించి పార్టీలో ఎవరైనాసరే వ్యక్తిగతంగా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. పార్టీల నేతలు సంయమనం పాటించాలని సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు.

Updated Date - 2020-09-24T21:36:35+05:30 IST