ఇనుప ఖనిజాన్ని సజ్జల, సోదరుడు దోచేసింది నిజంకాదా?: వర్లరామయ్య

ABN , First Publish Date - 2020-09-22T01:33:34+05:30 IST

2007-2010 మధ్యలో రూ.5 వేల కోట్ల విలువైన లక్షా 40 టన్నుల.. ఇనుప ఖనిజాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సోదరుడు దోచేసింది నిజంకాదా

ఇనుప ఖనిజాన్ని సజ్జల, సోదరుడు దోచేసింది నిజంకాదా?: వర్లరామయ్య

అమరావతి: 2007-2010 మధ్యలో రూ.5 వేల కోట్ల విలువైన లక్షా 40 టన్నుల.. ఇనుప ఖనిజాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సోదరుడు దోచేసింది నిజంకాదా? అని టీడీపీ నేత వర్లరామయ్య ప్రశ్నించారు. అమరావతి భూముల్లో ఏ అవినీతి లేదని, మంత్రుల సబ్‌కమిటీ తేల్చిన విషయం సజ్జలకు తెలియదా అని నిలదీశారు. భూదందా, ఇసుక, లిక్కర్‌, మైనింగ్‌ మాఫియాలపై.. సీబీఐ విచారణ జరిపించే ధైర్యం సజ్జలకు ఉందా? అని వర్లరామయ్య ప్రశ్నించారు. తాము చెప్పిన అంశాలపై సీఎం జగన్‌ ప్రభుత్వం సీబీఐ విచారణ జరిపిస్తే.. మూడో వంతు కేబినెట్‌ ఖాళీ అవుతుందని, సగం మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు జైలుకు వెళ్తారని వర్లరామయ్య హెచ్చరించారు.

Updated Date - 2020-09-22T01:33:34+05:30 IST