బీజేపీ దేశమౌలిక లక్షణాలను నాశనం చేస్తోంది: శైలజానాథ్‌

ABN , First Publish Date - 2020-10-01T20:33:09+05:30 IST

ఆర్ఎస్ఎస్ నిర్ధేశాలకు అనుగుణంగా.. బీజేపీ దేశమౌలిక లక్షణాలను నాశనం చేస్తోందని...

బీజేపీ దేశమౌలిక లక్షణాలను నాశనం చేస్తోంది: శైలజానాథ్‌

విశాఖ: ఆర్ఎస్ఎస్ నిర్ధేశాలకు అనుగుణంగా.. బీజేపీ దేశమౌలిక లక్షణాలను నాశనం చేస్తోందని ఏపీపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ విమర్శించారు. గురువారం ఆయన మాట్లాడుతూ బీజేపీ వచ్చాక గ్రోత్‌ రేట్‌ పడిపోయిందన్నారు. వ్యవసాయానికి మద్దతు ధర ప్రవేశపెట్టింది కాంగ్రెసేనని అన్నారు. స్నేహితులకి, కావాల్సిన వాళ్లకి ఇవ్వడం కోసం.. వ్యవసాయ బిల్లును బీజేపీ తీసుకొచ్చిందని ఆరోపించారు. రైతులను అదానీ, అంబానీలకు బానిసలుగా చేసే ప్రయత్నం చేసిందని, మోటార్లు బిగించడం అంటే.. రైతు మెడకు ఉరితాళ్లు బిగించడమేనని శైలజానాథ్‌ వ్యాఖ్యానించారు.

Updated Date - 2020-10-01T20:33:09+05:30 IST