నూతన సంవత్సర వేడుకలు వద్దు: శైలజానాథ్

ABN , First Publish Date - 2020-12-30T23:20:11+05:30 IST

నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సాకె శైలజానాథ్ పిలుపునిచ్చారు. బుధవారం నాడు ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీ ప్రవేశపెట్టిన వ్యవసాయ అనుబంధ బిల్లులకు

నూతన సంవత్సర వేడుకలు వద్దు: శైలజానాథ్

అమరావతి: నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సాకె శైలజానాథ్ పిలుపునిచ్చారు. బుధవారం నాడు ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీ ప్రవేశపెట్టిన వ్యవసాయ అనుబంధ బిల్లులకు వ్యతిరేకంగా కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేస్తున్నారని అన్నారు. కార్పొరేట్ శక్తుల అభివృద్ధే ధ్యేయంగా బీజేపీ ప్రభుత్వం పని చేస్తోందని విమర్శించారు. అన్నదాతలు రోడ్డు మీదకు వచ్చి ఇన్ని రోజులుగా పోరాటం చేస్తున్నా కూడా ప్రభుత్వంలో కొంత కూడా చలనం లేకపోవడం దుర్మార్గపు అని మండిపడ్డారు. అలాగే రైతుల పట్ల కనికరం లేకుండా వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం వంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల రైతులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో రైతులు సతమతం అవుతున్నారని శైలజానాథ్ పేర్కొన్నారు. తొలి నుంచి రైతు పక్షపాతి అయిన కాంగ్రెస్ పార్టీ.. రైతులకు మద్దతుగా అనేక కార్యక్రమాలు చేసిందన్నారు. నేడు రైతులు రోడ్డెక్కి ధర్నా చేస్తున్న నేపథ్యంలో వారికి మద్దతుగా నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ కమిటీ నిర్ణయించిందని శైలజానాథ్ వెల్లడించారు. రైతులు చేస్తున్న దీక్షకు మద్దతు తెలపాలని కాంగ్రెస్ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.

Updated Date - 2020-12-30T23:20:11+05:30 IST