-
-
Home » Andhra Pradesh » sai prathap condemns to join bjp
-
బీజేపీలో చేరికపై స్పందించిన సాయిప్రతాప్
ABN , First Publish Date - 2020-12-28T16:56:49+05:30 IST
సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సాయి ప్రతాప్

కడప : సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సాయి ప్రతాప్ బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నట్లు సోమవారం ఉదయం నుంచి పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన విషయం విదితమే. అంతేకాదు ఇప్పటికే ఆయన ముహూర్తం ఖరారు చేసుకున్నారని కమలనాథులు సునీల్ ధియోదర్, సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి సమక్షంలో సాయి కండువా కప్పుకుంటారని వార్తలు రావడంతో దీనిపై ఆయన స్పందించారు.
తాను బీజేపీలోకి చేరట్లేదని.. ఇవాళ ఉదయం నుంచి వచ్చిన వార్తలన్నీ అవాస్తవాలేనని సాయిప్రతాప్ కొట్టిపారేశారు. తన అల్లుడు మాత్రమే బీజేపీలో చేరుతున్నట్లు సాయిప్రతాప్ వెల్లడించారు. 2016లో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్న ఆయన ప్రస్తుతం అదే పార్టీలోనే కొనసాగుతున్నారు.