సబ్బంహరి ప్రపంచ మేధావి అనుకుంటున్నారు: అధీప్ రాజు

ABN , First Publish Date - 2020-10-03T23:04:24+05:30 IST

మాజీ ఎంపీ సబ్బం హరి ప్రపంచ మేధావి అనుకుంటున్నారని ఎమ్మెల్యే అధీప్ రాజు విమర్శించారు. అధికారులపై సబ్బం హరి తీవ్ర పదజాలం వాడారని, సబ్బం హరికి ప్రత్యేక చట్టం ఉండదని చెప్పారు.

సబ్బంహరి ప్రపంచ మేధావి అనుకుంటున్నారు: అధీప్ రాజు

విశాఖ: మాజీ ఎంపీ సబ్బం హరి ప్రపంచ మేధావి అనుకుంటున్నారని ఎమ్మెల్యే అధీప్ రాజు విమర్శించారు. అధికారులపై సబ్బం హరి తీవ్ర పదజాలం వాడారని, సబ్బం హరికి ప్రత్యేక చట్టం ఉండదని చెప్పారు. సబ్బం హరి ఈ రోజు అడ్డంగా దొరికిపోయారని చెప్పారు. తప్పు ఒప్పుకొని మీరే ఆక్రమణలు తొలగించి ఉంటే బాగుండేదని అధీప్ రాజు అన్నారు. సబ్బం హరి ఇంటికి అనుకొని ఉన్న ప్రహరీ గోడను జీవీఎంసీ అధికారులు కూల్చివేసిన ఘటన కలకలం రేపుతోంది. అక్రమ కట్టడాలని అధికారులు చెబుతుండగా.. ముందుగా సమాచారం ఇవ్వకుండా జేసీబీలతో ఎలా కూల్చివేస్తారని సబ్బం హరి అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల చర్యను పలువురు ప్రముఖులు తీవ్రంగా తప్పుబడుతున్నారు.

Updated Date - 2020-10-03T23:04:24+05:30 IST