నేనేంటో విజయసాయికి తెలియదు: సబ్బం హరి

ABN , First Publish Date - 2020-10-03T18:04:27+05:30 IST

టీడీపీ నేత సబ్బం హరి ఇంటికి అనుకొని ఉన్న ప్రహరీ గోడను జీవీఎంసీ అధికారులు కూల్చివేశారు.

నేనేంటో విజయసాయికి తెలియదు: సబ్బం హరి

విశాఖ జిల్లా: టీడీపీ నేత సబ్బం హరి ఇంటికి అనుకొని ఉన్న ప్రహరీ గోడను జీవీఎంసీ అధికారులు కూల్చివేశారు. అక్రమ కట్టడాలని అధికారులు పేర్కొన్నారు. అయితే ముందుగా సమాచారం ఇవ్వకుండా జేసీబీలతో ఎలా కూల్చివేస్తారని సబ్బం హరి అధికారులపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. లీగల్‌గా వెళ్లేంత అంశం కాదని అన్నారు. 24 గంటల్లో ఈ సమస్యను క్లోజ్ చేస్తానన్నారు. తనకున్న ఆస్తులు పబ్లిక్ డొమైన్‌లో ఉంటాయని అన్నారు. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, తానేంటో సీఎం జగన్‌కు తెలుసునని అన్నారు. ‘బహుషా విజయసాయిరెడ్డికి ఇంకా తెలియదనుకుంటాను.. ఈ విశాఖపట్టణంలో కూర్చొని డ్యాన్స్ వేద్దామని అనుకుంటున్నారని, ఆ డ్యాన్స్‌ను కట్టిస్తాను.. నా గురించి తెలియక ఏదో చేయాలని అనుకున్నారని, ఎందుకు ఇలాంటి తప్పు చేశానాఅనిఅనుకున్న స్థాయికి తీసుకువెళతాను’’ అని సబ్బం హరి అన్నారు. 

Updated Date - 2020-10-03T18:04:27+05:30 IST