‘రస్‌ అల్‌ఖైమా’పై కమిటీ

ABN , First Publish Date - 2020-12-10T09:10:48+05:30 IST

రస్‌ అల్‌ఖైమా కంపెనీకి ఏపీఎండీసీకి మధ్య నడుస్తున్న వివాద పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. విశాఖ జిల్లాలో అల్యూమినియం పరిశ్రమ ఏర్పాటుకు వీలుగా రస్‌ అల్‌ ఖైమా సంస్థకు ఏపీఎండీసీ

‘రస్‌ అల్‌ఖైమా’పై కమిటీ

అమరావతి, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): రస్‌ అల్‌ఖైమా కంపెనీకి ఏపీఎండీసీకి మధ్య నడుస్తున్న వివాద పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. విశాఖ జిల్లాలో అల్యూమినియం పరిశ్రమ ఏర్పాటుకు వీలుగా రస్‌ అల్‌ ఖైమా సంస్థకు ఏపీఎండీసీ గతంలో బాక్సైట్‌ గనులను కేటాయించింది. గిరిజనులు, పర్యావరణవేత్తల నిరసనలతో ఆ గనుల కేటాయింపును రద్దుచేసింది. దీం తో తమకు నష్టం జరిగిందని రస్‌ అల్‌ఖైమా అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కోర్టులో కేసు వేసింది. ఈ నేపథ్యంలో ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు గనుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి, ఏపీఎండీసీ ఎండీలు సభ్యులుగా డైరక్టర్‌ ఆఫ్‌ మైన్స్‌ కన్వీనర్‌గా కమిటీని ఏర్పాటు చేసింది.  

Updated Date - 2020-12-10T09:10:48+05:30 IST