అనంతలో అధికార పార్టీ నేతల మట్టి దందా

ABN , First Publish Date - 2020-04-14T16:23:12+05:30 IST

అనంతలో అధికార పార్టీ నేతల మట్టి దందా

అనంతలో అధికార పార్టీ నేతల మట్టి దందా

అనంతపురం: జిల్లాలో అధికార పార్టీ నేతల మట్టి దందా జోరుగా సాగుతోంది. లాక్‌డౌన్ సమయంలో మట్టి తవ్వుతూ వైసీపీ నేతలు లక్షలు గడిస్తున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో జరుగుతున్న మట్టి దందాకు రైతులు అడ్డుతగిలారు. దీంతో  తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులు రెచ్చిపోయారు. లారీలకు అడ్డుపడితే అంతు చూస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. మరోవైపు లాక్‌‌డౌన్ ఉల్లంఘించి వైసీపీ నేతలు అక్రమార్జనకు పాల్పడుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


Updated Date - 2020-04-14T16:23:12+05:30 IST