కర్ణాటకకు కదిలిన ఆర్టీసీ బస్సులు

ABN , First Publish Date - 2020-06-18T12:52:00+05:30 IST

కర్ణాటకకు కదిలిన ఆర్టీసీ బస్సులు

కర్ణాటకకు కదిలిన ఆర్టీసీ బస్సులు

అనంతపురం: ఎట్టకేలకు ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు రాష్ట్రం దాటి కర్ణాటకకు పరుగు పెట్టింది. కరోనా లాక్‌డౌన్‌తో డిపోలకే ఆర్టీసీ బస్సులు పరిమితమయ్యాయి. ఆంక్షల సడలింపుతో రాష్ట్రంలో మాత్రమే తిరిగాయి. ఎట్టకేల కు బుధవారం ఏపీ, కర్ణాటక ప్రభుత్వాల అంగీకారంతో ఇరు రాష్ట్రాల మధ్య బస్సుల రాకపోకలు పునఃప్రారంభమయ్యాయి. తొలుత ఆర్టీసీ అధికారులు రూపొందించిన ప్రణాళిక మేరకు కాకుండా బెంగళూరు రూట్‌కు మాత్రమే అనంతపురం రీజియన్‌ నుంచి బస్సుల రాకపోకలు మొదలయ్యాయి. తొలిరోజు రీజియన్‌లోని అనంతపురం డిపో నుంచి 4, కదిరి, తాడిపత్రి, గుంతకల్లు డి పోల నుంచి 2 చొప్పున మొత్తం 10 బస్సులు బెంగళూరు వెళ్లాయి. బెంగళూరు వెళ్లే ప్రయాణికులందరికీ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది సమన్వయంతో ఆర్టీసీ సిబ్బంది ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాతే బస్సుల్లోకి అనుమతించి, పంపారు. వైద్య ఆరోగ్య సిబ్బంది రావటం జాప్యమవటంతో కొందరు ప్రయాణికులు వేచిచూసి, వెనుదిరిగారు.

Updated Date - 2020-06-18T12:52:00+05:30 IST