జర్నలిస్టులకు రూ.50లక్షల బీమా వర్తింపజేయాలి: ఏపీయూడబ్ల్యూజే
ABN , First Publish Date - 2020-07-19T08:46:18+05:30 IST
ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన కడపలో ఒకే రోజు ఇద్దరు జర్నలిస్టులు కరోనాతో మృతి చెందినా పట్టించుకోకపోవడం శోచనీయమని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్

ఒంగోలు, జూలై 18 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన కడపలో ఒకే రోజు ఇద్దరు జర్నలిస్టులు కరోనాతో మృతి చెందినా పట్టించుకోకపోవడం శోచనీయమని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వి.సుబ్బారావు వ్యాఖ్యానించారు. జర్నలిస్టుల కోర్కెల దినం సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో శనివారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఏడాదిలో జర్నలిస్టులకు ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా అమలు చేయని ముఖ్యమంత్రి జగన్ మాత్రమేనన్నారు. వెంటనే జర్నలిస్టులకు రూ.50లక్షల కొవిడ్ బీమా వర్తింప చేయాలని, ఆరోగ్య, ప్రమాద బీమా పథకాలను వెంటనే రెన్యువల్ చేయాలని డిమాండ్ చేశారు.