రూ. 5 లక్షల మద్యం పట్టివేత

ABN , First Publish Date - 2020-06-22T09:08:52+05:30 IST

తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారులు గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు

రూ. 5 లక్షల మద్యం పట్టివేత

దుగ్గిరాల, జూన్‌ 21: తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారులు గుంటూరు జిల్లా  దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు వద్ద ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. చుండూరు మండలం తొట్టెంపూడికి చెందిన పి. శ్రీకాంత్‌ సూర్యాపేటలోని ఓ వైన్‌షాపు నుంచి రాజేష్‌ అనే గుమస్తా సాయంతో ఓ వాహనంలో తవుడు బస్తాల మధ్య మద్యం సీసాల బాక్సులను తీసుకుని ఆదివారం తెల్లవారుజామున  కారులో అనుసరిస్తూ వచ్చాడు. సమాచారం తెలుసుకున్న స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు రేవేంద్రపాడు వద్ద నిఘావేసి రెండు వాహనాలను పట్టుకున్నారు. వాహనంలో తవుడు బస్తాల మధ్య ఉన్న బాక్సులను తెరచి చూడగా, ఓఏబీ బ్రాండ్‌ 75 బాక్సులు, మాన్షన్‌హౌస్‌ 3 బాక్సులతో మొత్తం సుమారు రూ.5 లక్షల విలువగల 3,744 మద్యం సీసాలున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-06-22T09:08:52+05:30 IST