రూ.117కోట్ల స్వాహాకు కుట్ర
ABN , First Publish Date - 2020-09-20T09:19:21+05:30 IST
నకిలీ చెక్కులతో సీఎం సహాయ నిధి(సీఎంఆర్‌ఎఫ్) నుంచి రూ.117కోట్లు స్వాహా చేసేందుకు చేసిన ప్రయత్నం బ్యాంకు

అమరావతి, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): నకిలీ చెక్కులతో సీఎం సహాయ నిధి(సీఎంఆర్‌ఎఫ్) నుంచి రూ.117కోట్లు స్వాహా చేసేందుకు చేసిన ప్రయత్నం బ్యాంకు అధికారుల అప్రమత్తతతో బెడిసికొట్టింది. గుర్తు తెలియని వ్యక్తులు నకిలీ సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు తయారు చేసి బెంగళూరులో 52.65కోట్ల చెక్కును, ఢిల్లీలో 39.85 చెక్కును, కోల్‌కతాలో 24.65కోట్ల చెక్కును క్లియరెన్సు కోసం బ్యాంకులకు పంపారు. ఈ మూడు చెక్కులూ విజయవాడలో సీఎంఆర్‌ఎఫ్ నిధులు అందజేసేందుకు కేంద్ర బ్యాంకుగా ఉన్న ఎంజీ రోడ్ ఎస్‌బీఐ బ్రాంచికి చెందినవి.వాటిపై రెవెన్యూశాఖ, సెక్రటరీ టు గవర్నమెంట్ పేరిట స్టాంప్, సంతకాలు ఉన్నాయి. వీటి ధ్రువీకరణ కోసం ఆయా బ్యాంకుల అధికారులు విజయవాడకు ఫోన్ చేయడంతో వ్యవహారం బట్టబయలైంది.