-
-
Home » Andhra Pradesh » Rowdysheeter brutally murdered in Visakhapatnam
-
విశాఖలో రౌడీషీటర్ దారుణ హత్య
ABN , First Publish Date - 2020-12-27T14:01:35+05:30 IST
జిల్లాలోని ఆరిలోవలో రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు.

విశాఖ: జిల్లాలోని ఆరిలోవలో రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈఘటన స్థానికంగా కలకలం రేపింది. గంజాయి పంపకాల్లో నలుగురు యువకులకు, రౌడీషీటర్ కోరాడ సాయికి మధ్య వాగ్వాదం జరిగింది. ఘర్షణలో కోపోద్రిక్తులైన యువకులు కత్తులతో రౌడీషీటర్‌ను దారుణంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.