ప్రతి గడపకు ‘అమరావతి’

ABN , First Publish Date - 2020-12-19T07:23:06+05:30 IST

‘‘అమరావతి ఉద్యమం ఏ స్థాయిలో ఉందో 365 రోజుల బహిరంగ సభ నిరూపించింది. ఇక రాష్ట్రంలో ప్రతి గడపకు అమరావతిని

ప్రతి గడపకు ‘అమరావతి’

జిల్లాల్లో రౌండ్‌టేబుల్‌ సమావేశాలు 

అమరావతి పరిరక్షణ సమితి నేతలు 


విజయవాడ, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): ‘‘అమరావతి ఉద్యమం ఏ స్థాయిలో ఉందో 365 రోజుల బహిరంగ సభ నిరూపించింది. ఇక రాష్ట్రంలో ప్రతి గడపకు అమరావతిని తీసుకెళ్తాం’’ అని అమరావతి పరిరక్షణ సమితి నాయకులు శివారెడ్డి, తిరుపతిరావు, డాక్టర్‌ శైలజ, పువ్వాడ సుధాకర్‌ తెలిపారు. విజయవాడలో శుక్రవారం వారు మీడియాతో మాట్లాడారు. రాయపూడి బహిరంగ సభ తర్వాత అధికార పార్టీ నాయకులకు వణుకు పుట్టిందన్నారు. త్వరలోనే అన్ని జిల్లాలకు వెళ్లి వైసీపీ మినహా అన్ని రాజకీయ పక్షాలతో రౌండ్‌టేబుల్‌ సమావేశాలు నిర్వహించి ప్రజలకు వాస్తవాలను వివరిస్తామని పేర్కొన్నారు.

Read more