గిరిజనులకు ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలు : జగన్‌

ABN , First Publish Date - 2020-06-16T10:03:03+05:30 IST

ఆదివాసీ దినోత్సవం నాటికి ఆర్‌వోఎఫ్‌ఆర్‌ (అటవీ హక్కుల గుర్తింపు) పట్టాలు ఇచ్చి గిరిజన రైతులకు రైతు భరోసా అందించాలని ..

గిరిజనులకు ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలు : జగన్‌

అమరావతి, జూన్‌ 15(ఆంధ్రజ్యోతి): ఆదివాసీ దినోత్సవం నాటికి ఆర్‌వోఎఫ్‌ఆర్‌ (అటవీ హక్కుల గుర్తింపు) పట్టాలు ఇచ్చి గిరిజన రైతులకు రైతు భరోసా అందించాలని ముఖ్యమంత్రి జగన్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం ఇక్కడి క్యాంపు కార్యాలయంలో ఈ విషయంపై ఆయన సమీక్ష నిర్వహించారు. అటవీ భూములపై వారికి హక్కులు కల్పించడం ద్వారా పెట్టుబడి సహాయం పొందడానికి అవకాశం కల్పించినట్లవుతుందన్నారు. ఈ విషయంలో అవినీతి ఉండకూడదని, గిరిజనులకు దారి చూపించేలా అధికారులు వ్యవహరించాలని జగన్‌ స్పష్టం చేశారు. 


20న నేతన్న నేస్తం:

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో నేతన్న నేస్తం రెండో విడత పంపిణీ ఈ నెల 20కి వాయిదా వేసినట్లు సమాచార శాఖ కమిషనర్‌ తుమ్మా విజయ్‌ కుమార్‌ రెడ్డి ప్రకటించారు. చేనేత వర్గాలకు ఆర్థిక ప్యాకేజీని ఈ నెల 17న లబ్ధిదారుల అకౌంట్లో వేయనున్నట్లు గతంలో ప్రకటించింది.

Updated Date - 2020-06-16T10:03:03+05:30 IST