కృష్ణాజిల్లా..గన్నవరం వెటర్నరీ కాలేజీ సమీపంలో రోడ్డు ప్రమాదం
ABN , First Publish Date - 2020-05-17T15:00:19+05:30 IST
జిల్లాలోని గన్నవరం వెటర్నరీ కాలేజీ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగిఉన్న లారీని వలస కూలీల బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందాగా..

కృష్ణా: జిల్లాలోని గన్నవరం వెటర్నరీ కాలేజీ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగిఉన్న లారీని వలస కూలీల బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. బస్సు చెన్నై నుంచి కోల్‌కతాకు వలస కూలీలతో వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.