రైల్వే బ్రిడ్జి ఫిల్లర్‌ను ఢీకొట్టిన సిమెంట్ మిక్సర్ లారీ
ABN , First Publish Date - 2020-11-26T17:27:03+05:30 IST
రైల్వే బ్రిడ్జి ఫిల్లర్‌ను ఢీకొట్టిన సిమెంట్ మిక్సర్ లారీ

విజయవాడ: నగరంలోని బస్టాండ్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే బ్రిడ్జి ఫిల్లర్‌ను సిమెంట్ మిక్సర్ లారీ ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందాడు. రెండు క్రేన్ల సాయంతో లారీని పక్కకు తీశారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.