రోడ్డుప్రమాదంలో తల్లీకొడుకు మృతి

ABN , First Publish Date - 2020-11-25T14:28:15+05:30 IST

రోడ్డుప్రమాదంలో తల్లీకొడుకు మృతి

రోడ్డుప్రమాదంలో తల్లీకొడుకు మృతి

విజయనగరం: జిల్లాలో భోగాపురం జాతీయ రహదారిపై రోడ్డుప్రమాదం సంభవించింది. బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో తల్లీకొడుకు మృతి చెందారు. గాజువాక నుంచి శ్రీకాకుళం వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

Read more