ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం

ABN , First Publish Date - 2020-11-21T12:41:24+05:30 IST

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది.

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం

ప్రకాశం: జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో  ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ నాగరాజు మృతి చెందారు. నాగులుప్పలపాడు మండలం చదలవాడ వద్ద గుర్తు తెలియని వాహనం నాగరాజు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. నాగరాజు ఒంగోలులో ఏఆర్‌హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన విధులు ముగించుకుని స్వగ్రామమైన  వేటపాలెంకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read more