ప్రైవేట్ బస్సు బోల్తా...ముగ్గురు మృతి

ABN , First Publish Date - 2020-11-03T21:15:50+05:30 IST

ప్రైవేట్ బస్సు బోల్తా...ముగ్గురు మృతి

ప్రైవేట్ బస్సు బోల్తా...ముగ్గురు మృతి

చిత్తూరు: జిల్లాలోని మదనపల్లె- పుంగనూరు రోడ్డులో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను మదనపల్లె ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2020-11-03T21:15:50+05:30 IST