తప్పంతా ఆర్జేడీదే!
ABN , First Publish Date - 2020-06-25T08:16:02+05:30 IST
ఐసీడీఎస్ విజయవాడ ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయంలో పదోన్నతులకు సంబంధించి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ..

రమణమూర్తి పదోన్నతిపై ఉద్యోగ సంఘం అధ్యక్షుడు సుబ్బరాజు
విజయవాడ, జూన్ 24: ఐసీడీఎస్ విజయవాడ ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయంలో పదోన్నతులకు సంబంధించి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి వనిత ఎలాంటి ఒత్తిళ్లు, సిఫారసులు చేయలేదని ఏపీ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు అడ్డాల సుబ్బరాజు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. విజయవాడలో పనిచేస్తున్న మహిళా సీనియర్ అసిస్టెంట్ తనకన్నా జూనియర్ అని, ఆమెకు పదోన్నతి ఇచ్చి తనకు ఇవ్వలేదని రమణమూర్తి మంత్రికి తెలియజేశారని, దీనిపై మంత్రి తగిన సూచనలు ఇవ్వాల్సిందిగా ఉన్నతాధికారులను ఆదేశించారని ఆయన తెలిపారు.
కానీ, వారి నుంచి తగిన సూచనలు రాకముందే ఏలూరు ఆర్జేడీ మళ్లీ పదోన్నతుల ప్రక్రియను కొనసాగించారని, రమణమూర్తికి పదోన్నతి కల్పిస్తూ విజయవాడలో పోస్టింగ్ ఇవ్వడంతో సమస్య ప్రారంభమైందన్నారు. పదోన్నతుల ప్రక్రియలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా జరపాలన్న ఉద్దేశంతో మంత్రి ఈ మొత్తం ప్రక్రియపై విచారణ జరిపించాలని డైరెక్టర్‌ను కోరారని చెప్పారు. ఏలూరు ఆర్జేడీ నిబంధనలకు విరుద్ధంగా రమణమూర్తికి పదోన్నతి కల్పించడంలో అన్యాయం చేశారే తప్ప, మంత్రి ఎలాంటి తప్పు చేయలేదని సుబ్బరాజు వివరించారు.