కృష్ణానదికి పెరుగుతున్న వరద ఉధృతి

ABN , First Publish Date - 2020-08-20T18:01:55+05:30 IST

కృష్ణానదికి గంట గంటకు వరద ఉధృతి పెరుగుతోంది.

కృష్ణానదికి పెరుగుతున్న వరద ఉధృతి

కృష్ణానదికి గంట గంటకు వరద ఉధృతి పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో శ్రీశైలం ప్రాజెక్టులోని ఐదు గేట్లు పది అడుగులమేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు 4 లక్షల 30వేల క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో ఉంది.


భద్రాచలంలో మళ్లీ స్వల్పంగా వరద పెరుగుతోంది. మంగళవారం రాత్రి 61.04 అడుగులకు చేరిన వరద క్రమంగా తగ్గుతూ 42.6 అడుగులకు చేరింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించారు. అయితే ఎగువన కురుస్తున్న వర్షాలకు మళ్లీ ఉధృతి క్రమ క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం 44.8 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మళ్లీ మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

Updated Date - 2020-08-20T18:01:55+05:30 IST