ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-09-06T23:19:23+05:30 IST

రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. వరుసగా 11వ రోజు 10 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు ఏపీలో కొత్తగా

ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు

అమరావతి: రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. వరుసగా 11వ రోజు 10 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు ఏపీలో కొత్తగా 10,794 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో 4,98,125కు కరోనా కేసులు చేరాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 70 మంది మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 4,417 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం ఏపీలో 99,689 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా నుంచి కోలుకుని 3,94,019 మంది రికవరీ అయ్యారు. ఏపీలో ఇప్పటివరకు 41,07,890 కరోనా టెస్టులు నిర్వహించారు. చిత్తూరు 9, అనంతపురం, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 8 మంది చొప్పున మృతి చెందారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విశాఖ జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృతి చెందారు. కృష్ణా, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో నలుగురు చొప్పున మృతి చెందారు. శ్రీకాకుళం 2, విజయనగరం జిల్లాలో కరోనాతో ఒకరు మృతి చెందారు.

Updated Date - 2020-09-06T23:19:23+05:30 IST