సచివాలయంలో పెరుగుతున్న కేసులు
ABN , First Publish Date - 2020-10-19T09:18:07+05:30 IST
సచివాలయంలో పెరుగుతున్న కేసులు

అమరావతి సచివాలయం, అసెంబ్లీలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. తాజాగా ఇక్కడ మరో ఏడుగురికి వైరస్ సోకింది. దీంతో ఇప్పటి వరకు సచివాలయం, అసెంబ్లీలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 195కి చేరింది. సచివాలయం మొదటి బ్లాకులో అసిస్టెంట్ సెక్షన్ అధికారికి, ప్రభుత్వ సలహాదారు పీఆర్‌వోకి, రెండో బ్లాకు ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌కి, ప్లానింగ్‌లో విభాగంలో అసిస్టెంట్ సెక్షన్ అధికారికి, సచివాలయంలో ఎస్‌ఫీఎఫ్ కానిస్టేబుల్‌కి కరోనా సోకింది. అలాగే.. అసెంబ్లీలో సెక్షన్ అధికారికి, హోం డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ సెక్రటరీకి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.