ఆర్‌జీయూకేటీ సెట్‌కు 96% హాజరు

ABN , First Publish Date - 2020-12-06T08:51:59+05:30 IST

ఆర్‌జీయూకేటీ సెట్‌కు 96% హాజరు

ఆర్‌జీయూకేటీ సెట్‌కు 96% హాజరు

అమరావతి/వేంపల్లె, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాల కోసం శనివారం నిర్వహించిన ఆర్‌జీయూకేటీ సెట్‌-2020కు 96శాతం మంది హాజరయ్యారు. ఈ పరీక్షకు మొత్తం 88,974 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 85,760 మంది పరీక్ష రాశారు. ఈ సెట్‌  ప్రాథమిక ‘కీ’పై అభ్యర్థులు తమ అభ్యంతరాలను  ఠీఠీఠీ.టజఠజ్టు.జీుఽ లో ఈ నెల 7 సమర్పించవచ్చు. ఫైనల్‌ ‘కీ’ని 8న ప్రదర్శిస్తామని, ఫలితాలను 12న విడుదల చేస్తామని సెట్‌ చైర్మన్‌ ప్రకటించారు.  

Read more